Wednesday, November 25, 2009
నిఘంటువు
జిగిబిగి పద వీధుల్లో
తారాడే బాషా బాటసారికి
దారి చూపి గమ్యం చేర్చే
నమ్మకమయిన మార్గదర్శివి...
పుస్తకాల పురుగు ప్రక్కనే ప్రవహిస్థూ
నిరంతర పద దాహం తీర్చే జీవనది..
రచయిత ఉహాల తోటల్లో
విన్నూత్న భావాల మల్లెలు పూయించే
పడకటింటి తోడు....
కవి చేతిలో పోపుల డబ్బా..
ఓ నిఘంటువా..!
మా అనంతమయిన పద భాండాగారమా..!!
ఒక కొత్త పద అర్ధాన్ని తెలుసుకున్నప్పుడల్లా..
సరి కొత్త ప్రపంచపు జ్ఞాన ద్వారాలు తెరుచు కుంటాయి..
పదాల, పద బందాల
పరమార్ధం తెలిపే గురువు కానీ ..
మన తెలుగు వారందరికీ
సర్వోన్నత సందేశాలు పంపే తీపి పంచనీ....
ఓ నిఘంటువా..!
నీవు ఈ ప్రపంచాన్ని ఒకటిగా నిలిపేదానివి..
మాటల బంగారు తీగకు
మానవత్వపు పూసలు గుచ్చినట్లు..
సముద్రపు నిధి లాంటి
నిన్ను ఈదిన ప్రతిసారీ
ఈ గ్రహాన్ని జయించిన విజేత నవుతుంటాను...!!!
ఆంగ్ల మూలం :మైదవోలు సత్యనారాయణ,నెల్లూరు
తెలుగు అనువాదం:పెరుగు రామకృష్ణ,నెల్లూరు
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
cbrao (Bhaskara Rao Chimakurthy) గారికి.... తేట తెలుగు తియ్యదనానికి వేప చేదు కలిపి నట్ట్లుంటుందా... మళ్ళీ నువ్వుండేది హైదరాబాద్ లో... మా భాష గురించి ఇలాంటి వెకిలి మకిలి ఆలోచన ఉన్నవాడివి మా ప్రాంతంలో ఎందుకున్నావ్... వెళ్ళిపో .. మా భాషని గౌరవించేవాడికే మా ప్రాంతంలో చోటు... నీలాంటి ఆవు పాలు తాగి ... దాని డొక్కలో తన్నే వాడికి కాదు...
Post a Comment