Thursday, December 31, 2009
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నెల్లూరు రొట్టెల పండుగ
Darga - famous for Rottela Panduga (Bread festival of Nellore)
నెల్లూరు నగరం లోని "బారా షహీద్ దర్గా" మొహరం పండుగ వస్తే చాలు దేశ,విదేశాలనుండి భక్తులని ఆకర్షిస్తూ రొట్టెలు పంచుకొని, మొక్కులు చెల్లించుకొనే "ఒకే ఒక విశేషపండుగ" జరుపుకొనే ఏకైక ప్రదేశం గానమోదయి చరిత్రలో నిలచిపోయింది. భారతదేశ సంస్కృతి, సమైక్యత,మతసామరస్యానికి,ప్రతీకగా ఈ రొట్టెల పండుగనిలుస్తుంది.ప్రతి సంవత్సరం ఈ దర్గా దర్శించి మొక్కులు చెల్లించే వారిలో ముస్లిములతో పాటు,ఇతర మతాల వారుముఖ్యంగా స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ రొట్టెల పండుగ సుమారు ఎనభై సంవత్సరాలుగా ఇక్కడజరుగుతున్నట్టు ఆధారా లు వున్నాయి. 1905 లో ఈ దర్గా ప్రస్తావన నెల్లూరు శాసనాలు రెండవ సంపుటం లోకనిపిస్తుంది.
బారా షహీద్ దర్గా కు సంబంధించి ఒక కధ వుంది. యుద్దంలో పన్నెండు మంది వీరులు నెల్లూరు కు దగ్గరలో గలగండవరం వద్ద అమరులయ్యారు.తలలు లేని ఆ వీరుల దేహాలు గుర్రాలపై స్వారి చేస్తూ ఇప్పుడు సమాదులున్న చోటపడిపోయాయి.భక్తులు ఆ ప్రదేశం లోనే వారికి సమాధులు వరుసగా నిర్మించి ఆరాధించడం మొదలెట్టారు. ఆర్కాటునవాబు ఒక సారి ఆ దారిన వెళ్తూ దర్గా వద్ద ఏదో మొక్కు మొక్కుకున్నారట. ఆయన కోరిక నెరవేరడం తో మరుసటిఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ,చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కధనం. ఆ సంఘటనానంతరమే రొట్టెలపండుగ మొదలైందని పెద్దలు చెపుతుంటారు. 1930 లలో ఈ రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా జరుగుతూ, స్థానిక పత్రికల లో నమోదు అయివున్నట్లు తెలుస్తుంది.
మత సామరస్యానికి ప్రతీకగా ఎంతో వైభవంగా, అశేష భక్త జన సందోహం మధ్య జరిగే ఈ రొట్టెల పండుగ ఈ ఏడాది 28 డిసెంబర్మొదలై 29 న గంధ మహోత్సవం,30 న రొట్టెల మార్పిడి,31 న జియారత్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ రొట్టెల పండుగ లో రొట్టెలు మార్పిడి చేసుకొన్నభక్తులు జిల్లా లోని కసుమూరు,అనుమసముద్రం పేటల లోనిపేరొందిన దర్గాల ను కూడా సందర్శిస్తారు.
పవిత్రంగా, పరిశుభ్రంగా ఇంటిలో తయారు చేసుకొచ్చిన చపాతీలు(రొట్టెలు)చెరువు లోని నీళల్లో దిగి తలపై ముసుగువేసుకొని మార్పిడి చేసుకుంటారు భక్తులు.ఆరోగ్యం గురించి మొక్కు కొంటె ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టెకావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు.ఇలాగే విద్యా రొట్టె, పెళ్లి రొట్టె ,సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె,..సంప్రదాయ రొట్టెలుతో మొదలైన పండుగలో ఇప్పుడు వీసా రొట్టెలు, ప్రజా ప్రతినిధులు వదిలే అభివృద్ధి రొట్టెలు అదనపుఆకర్షణలవుతున్నాయి.ఈ ఏడాది ప్రత్యేకించి రొట్టెల పండుగ జనవరి లో జరిగి మళ్ళీ రెండవసారి డిసెంబర్ లో వచ్చింది.
బారా షహీద్ అమరవీరుల సమాధుల ద్వారం
లక్ష్యల సంఖ్య లో ప్రజలు దేశం లోని వివిధ ప్రదేశాల నుంచిమరియు గల్ఫ్ లాంటి విదేశాల నుంచి వచ్చి మొక్కులుచెల్లించడం
పెరిగి పోతున్నందున జిల్లా యంత్రాంగం ఇప్పుడు ప్రత్యేక దృష్టిపెట్టి రవాణ సౌకర్యం,అన్నదానాలు, మంచినీరు,మరుగుదొడ్లు,
లాంటి వసతులన్నీ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తుంది. ఇదిఎంతయినా అభినందనీయం..! దర్గా మైదానంలో ఎక్కడ చెత్తలేకుండా చూసే భాద్యతను నెల్లూరు నగర పాలక సంస్థచేపట్టింది.ఈ కార్యక్రమంలో నగర ఎమెల్యే ఎం.శ్రీధరకృష్ణా రెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమెల్యే ఆనం.వివేకానంద రెడ్డి జిల్లా కలెక్టర్రాంగోపాల్,ఎస్పీ మల్లారెడ్డి , మేయర్ భానుశ్రీ తదితరులునిమగ్నమై వున్నారు..!
ఈ పండుగ గురించి తెలియని వారు వచ్చే సంవత్సరం మొహరం రోజుకి నెల్లూరు వచ్చేయండి..!
రొట్టెల పండుగలో పాల్గొనండి..!!
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
నూతన సంవత్సర శుభాకంక్షలు.:)
"బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
కోసం ఈ కింది లంకే చూడండి.
http://challanitalli.blogspot.com/2009/12/2009.html
Post a Comment