మన పురాణాలు ,ఇతిహాసాలు ,మహాత్ముల జీవితాలు అధ్యయనమే అన్ని నైతిక విలువలను నేర్పుతుందని ఆమంచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాథశాల తెలుగు ఉపాధ్యాయురాలు ,కవయిత్రి పెరుగు సుజనారామం తెల్పారు. స్థానిక దర్గామిట్ట లోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలోగురు వారం సాయంత్రం ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిధి గా హాజారైన ఆమె బాలికలకు స్ఫూర్తి నిచ్చే పలు అంశాలు ప్రస్థావించారు. ముఖ్యంగా బాలికా విద్య ప్రారంభించిన సావిత్రి భాయి ఫులే ను పిల్లలకు గుర్తు చెసారు. ఖాళీ సమయంలో తాను తరచు ఇక్కడ పదవ తరగతి బాలికలకు తెలుగు మరియు ఇతరులకు అందరికీ నైతిక విలువలు తెల్పే మంచి కథలు చెపుతానని వాగ్దానం చెసారు. సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ కవి పెరుగు రామకృష్ణ ఇటీవల తాను రాసిన పిల్లల నవలిక హృదయ బంధం పిల్లలకు పరిచయం చేసి పొరుగు వారి పట్ల ,పొరుగు దేశాల పట్ల స్నేహ భావం కలిగి వుండాలన్నారు .. వసతి గృహ వార్డెన్ బేబీ విద్య సంవచరం ప్రారంభంలోనే పిల్లలకు ఇలాంటి మంచి విషయాలు చెప్పినందుకు ధన్య వాదాలు తెల్పరు. సహృదయ సంస్థ అధ్యక్షలు సనత్ కుమార్,కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రసంగించారు అనంతరం బాలికలు జానపద గీతాలు ఆలపించారు.
No comments:
Post a Comment