నా ఉగాదికి
తెలుగు దిగులు పట్టుకుంది
ఇంగ్లీష్ చెద
ఆకు ఆకుకీ పాకుతోంది
అమ్మపాలూ ,ఆవు పాలూ తాగి
"అమ్మా" అన్న బుడత
డబ్బా పాలు గుటకేసి
"మమ్మీ" అంటున్నాడు
ఓనమాలు నేర్చిన రోజుల్లో
మాతృదేవోభవ అన్నవాడు
ఏ బి సి డి లు మరిగి
ఓల్డ్ ఏజ్ హోం అంటున్నాడు
అందం చెదరకూడదని
రొమ్ము దాచుకున్న అమ్మాయి
అమ్మతనం కోల్పోయి
డొల్లగా మిగిలిపోయింది
గ్రీన్ కార్డు కలల్లో తండ్రి
గురక నిద్ర వదిలిన్చుకునేసరికి
అమెరికా లో అబ్బాయి
ఆర్మేనియన్ అమ్మాయికి మూడు ముళ్ళేసాడు
"మందార మకరంద మాధుర్యములు
గ్రోలిన మధుపంబు జనునే వ్యర్ధ వనములకు "
అన్న అమృతం జీర్ణించుకోలేక
ఆరు ఔన్సుల కాక్టెయిల్ చప్పరించిన వాడికి
ఉగాది పచ్చడెక్కడ రుచిస్తుంది..?
ఎవడి యాసల కుంపటి
వాడు నెత్తిన మోస్తుంటే
కలగూర గంపలో
సంజీవని ఎక్కడుంది..?
కట్టుబాట్లని మనం కల్తీ చేస్తే
తెలుగు తల్లిని మనవాడు కల్తీ చేస్తున్నాడు
తేడా పెద్దగా ఏమీ లేదు
ఇద్దరం యావజ్జీవ నేరస్తులమే....!
పెరుగు.రామకృష్ణ,
5 comments:
ye okkka mata pollupokunda.. chala chakkani meaning tho raseru andi ..
chala bagundi ...
Dhanyavadaalandee..!
ఎవడి యాసల కుంపటి
వాడు నెత్తిన మోస్తుంటే
కలగూర గంపలో
సంజీవని ఎక్కడుంది..?
chala baga chepparu....
Nijamgaa cheppaaru
Nijamgaa cheppaaru
Post a Comment