తెలుగు నేలపై ఇలాంటివి ఎందుకు జరగవూ ..?
కేంద్ర సాహిత్య అకాడెమీ బెంగుళూరు ప్రాంతీయ కార్యాలయం ఆహ్వానం మేరకు జూలై 17 నుండి 21 వరకు
కేంద్ర సాహిత్య అకాడెమీ బెంగుళూరు ప్రాంతీయ కార్యాలయం ఆహ్వానం మేరకు జూలై 17 నుండి 21 వరకు
కర్ణాటక లోని ధార్వాడ్ పట్టనం లో జరిగిన సాహిత్య కార్యక్రమం లో ఒకటైన బహు భాషా కవిసమ్మేలనంలో
తెలుగు ఆహ్వానిత కవిగా వెళ్ళాను.ఈ సందర్భంగా ముగ్గురు జ్ఞాన పీథ కవులకు జన్మ నిచ్చిన ఆ ఊరులో
దిగిన వెంటనే వళ్ళు పులకించింది..ఆ నేలను ముద్దాడాలని పించింది.మా కవి ఘోస్టికీ ముందు అకాడెమీ వారు
కర్ణాటక సాహిత్యంలో అయిదవ జ్ఞాన పీత్ అవార్డు గ్రహీత, ప్రసిద్ద కవి,బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన దత్తాత్రేయ
రామచంద్ర బెంద్రే జాతీయ ట్రస్ట్ "బెంద్రే భవన్" కి కవులన్దర్నీ తీసుకేల్లినారు.ఒక జ్ఞాన పీత్ గ్రహీత కవికి ఆ
రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ట్రస్ట్ ఏర్పాటు చేసి బెంద్రే సాహిత్య జ్ఞాపకాల్ని పదిలపరచిన విధానం అబ్బుర పరచింది.
1896జనవరి31 వ తేదీ అంబాబాయ్,రామచంద్రపంత పుణ్య దంపతులకు జన్మించిన బెంద్రే కన్నడ సాహిత్యంలో
అత్యున్నత స్థాయి కవిగా,విమర్సకులుగా,నాటక కర్తగా,పాటల రచయితగా,కధానిక రచయితగా ,అనువాదకులుగా,
గొప్ప వక్తగా,ఇంతింతై వటుడింతై చందాన జాతీయ కవిగా ,విశ్వ వ్యాప్తంగా ఖ్యాతి గడించి, జీవితానికి సార్ధకత చేకూర్చూకుని,
కన్నడ సాహిత్యాన్ని పరిపుష్టి చేసి, పలు ఉన్నత పురస్కారాలన్డుకుని, 1981 అక్టోబరు 26 న ముంబై లోని హరికృష్ణ దాస్
ఆసుపత్రిలో నరక చతుర్దశి నాడు పరమ పదించారు..ఇంతటి గొప్ప సాహితీ సృజనకారున్ని పలు పదవులు,అవార్డులూ
తాముగా వరించి అలరించ్చాయి..కన్నడ సాహిత్య సంమేలన్ అధ్యక్షులుగా,పలు విశ్వ విద్యాలయాల గౌరవ డాక్టరేట్ లు ,
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు,కేంద్ర సాహిత్య అకాడెమీ ఫెల్లోవ్శిప్,ప్రతిష్టాత్మక జ్ఞాన్ పీత్ అవార్డు అలవోకగా ఆయన్ని
వరించాయి..వీటితో ఆయన కన్నడ కవిగా కాక ప్రముఖ భారతీయ కవిగా ,కన్నడ సాహిత్యానికి ఒక అమూల్య సంపదగా
మిగిలారు.
ఇది గమనించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం 1993 లో ధార్వాడ్ నగరంలో బెంద్రే జీవితాంతం నివసించిన ఇంటి పక్కనే
బెంద్రే జాతీయ ట్రస్ట్ గా ప్రకటించి 2000 సం// లో విశాలమైన మూడు అంతస్తుల బెంద్రే భవన్ నిర్మించి దాన్ని గొప్ప
స్మారక కేంద్రం గా,బెంద్రే సాహిత్యం అధ్యయన నిలయంగా మార్చి, ఇప్పటికీ విభిన్న కోణాల్లో వారి రచనలపై శాస్త్ర్రేయ పరిశోధనలు
చేస్తూ,వాటిల్లోని కొత్త కోణాల్ని ఆవిష్కరిస్తూంది..అంతే గాక హంపి లోని కన్నడ విశ్వ విద్యాలయం తో కలసి చేసే పి.హెచ్.డి.
ల ద్వారా వెలువడే సిద్దాంత గ్రందాల ప్రచురణ భాద్యత చేపట్టింది..ప్రతి సంవస్త్చారం బెంద్రే జన్మ దినం నాడు భారతీయ సాహిత్యంలో
విశేష కృషి చేసిన వారికి అమ్బికతనయదత్త పేర పురస్కారం ఒక లక్ష రూపాయలు నగదు ,జ్ఞాపికతో సత్కరిస్తుంది ట్రస్ట్.
ఇది కాక కన్నడ భాషలో విశేష కృషి చేసిన ఎనిమిది మందికి అంబిక తనయ దత్త బహుమతి క్రింద ఒకొక్కరికి ఇదు వేలు
నగదు,జ్ఞాపికకతో గౌరవిస్తుంది.
ప్రసరంగ పేరుతో బెంద్రే రచనల పునర్ముద్రణ ,అనువాద ప్రచురణ అవిశ్రాంతంగా ప్రచురించి దేశ ,విదేశాల్లో ప్రచారం చేస్తుండడం
అభినందనీయ విషయం.
బెంద్రే భవన్ క్రింది అంతస్తులో ఆడిటోరియం, వారి జీవితం,సాహిత్యం తెలిపే డాకుమెంటరీ ప్రదర్సన ,ఏర్పాటు చేసారు.
మొదటి అంతస్తులో బెంద్రే రచనలు,సమస్తం,ప్రదర్శనలో వుంచి ,వారి రచనల్లో చెరగని ముద్ర వేసిన పాత్రల నిలువెత్తు చిత్రాలు,
వారి అవార్డులు అమర్చారు.రెండవ అంతస్తులో బెంద్రే జీవితంలో కవిగా ముఖ్య సందర్భాల్ని చాటే ఫోటో,చిత్ర ప్రదర్సన ఏర్పాటు చేసారు.
దానిపైన ఒక వసతి గృహం కూడా వుంది.బెంద్రే భవన్ ముందు కర్నాటక టూరిసం శాఖ బోటు షికారు,ఓపెన్ థియేటర్ ,పార్క్
అందంగా రూపొందించి, విచ్చేసే సాహిత్యకారులకు ఆహ్లాద వాతావరణం కలిగించి, ఈ తరంకి బెంద్రే ను సగర్వంగా పరిచయం
చేస్తున్నారు... ఈ నగరానికి విచ్చేసే కవులను బెంద్రే గ్రందాలతో సత్కరించి పంపే సంస్కృతి నిర్విఘ్నంగా కొనసాగిస్తూంది బెంద్రే భవన్..
తెలుగు నేలపై ఇప్పటి వరకు ఇద్దరు జ్ఞాన్ పీత్ గ్రహీత కవులుంటే, వారికి ఇంతటి సముచిత గౌరవం ఎందుకు దక్కడం లేదో, ఎంత
ఆలోచించినా అర్ధం కావట్లేదూ..?
పెరుగు.రామకృష్ణ
9849230443
No comments:
Post a Comment