Friday, June 21, 2013
మన పురాణాలు ,ఇతిహాసాలు ,మహాత్ముల జీవితాలు అధ్యయనమే అన్ని నైతిక విలువలను నేర్పుతుందని ఆమంచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాథశాల తెలుగు ఉపాధ్యాయురాలు ,కవయిత్రి పెరుగు సుజనారామం తెల్పారు. స్థానిక దర్గామిట్ట లోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలోగురు వారం సాయంత్రం ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిధి గా హాజారైన ఆమె బాలికలకు స్ఫూర్తి నిచ్చే పలు అంశాలు ప్రస్థావించారు. ముఖ్యంగా బాలికా విద్య ప్రారంభించిన సావిత్రి భాయి ఫులే ను పిల్లలకు గుర్తు చెసారు. ఖాళీ సమయంలో తాను తరచు ఇక్కడ పదవ తరగతి బాలికలకు తెలుగు మరియు ఇతరులకు అందరికీ నైతిక విలువలు తెల్పే మంచి కథలు చెపుతానని వాగ్దానం చెసారు. సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ కవి పెరుగు రామకృష్ణ ఇటీవల తాను రాసిన పిల్లల నవలిక హృదయ బంధం పిల్లలకు పరిచయం చేసి పొరుగు వారి పట్ల ,పొరుగు దేశాల పట్ల స్నేహ భావం కలిగి వుండాలన్నారు .. వసతి గృహ వార్డెన్ బేబీ విద్య సంవచరం ప్రారంభంలోనే పిల్లలకు ఇలాంటి మంచి విషయాలు చెప్పినందుకు ధన్య వాదాలు తెల్పరు. సహృదయ సంస్థ అధ్యక్షలు సనత్ కుమార్,కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రసంగించారు అనంతరం బాలికలు జానపద గీతాలు ఆలపించారు.


Tuesday, June 18, 2013

నెల నెలా వెన్నెల వార్త -16-06-2013

తెలుగు నాటకరంగంలో నేల్లూరీయులైన వేదం వెంట్రాయ శాస్త్రి నాటక రచనలో పాత్రోచిత సంభాషణలు
ప్రవేశ పెట్టిన ఆద్యులు అని ,ఆయన గ్రాంధిక భాషావాది అయినప్పటికీ నాటకంలో పాత్రల నేపథ్యానికి
అనుగుణంగా భాష ఉండటం వల్ల ప్రతాపరుద్రీయం నాటకం విశేష ప్రజాదరణ పొందిందని ప్రముఖ నాటకరంగ విశ్లేషకులు సాహితీ వేత్త డాక్టర్ కడియాల రామోహనరాయ్ పెర్కొన్నరు. స్థానిక ప్రభుత్వ సంగీత కళాశాల లో జరిగిన నెల నెలా వెన్నెల పదిహేడవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. 

నూట యాభై ఏళ్ళ తెలుగు నాటక రంగం పై మొదటి వందేళ్ళ గురించి సూక్ష్మంగా, తరువాతి యాభై ఏళ్ళ గురించి విపులంగా ప్రస్థావించారు. తెలుగు నాటక రంగంకు నూతన దశ దిశా నిర్దేశించటంలో ఇద్దరు ప్రముఖులు రాజమన్నార్ ,బళ్ళారి రాఘవ ల పాత్ర ప్రముఖమయినది అన్నారు. కందుకూరి వీరేశలింగం రాసిన తొలి వీధి నాటకంతో మొదలై ఇప్పటికి సుమారు పదివేలకు పైగా నాటకాలు, నాటికలు వచ్చాయన్నారు నేల్లూరీయులైన ఆత్రేయ రాసిన యన్ జి ఓ నాటకం వైవిధ్య భరితం అన్నారు. ప్రస్తుతం గత యాభై ఏళ్ళ తెలుగు నాటక వికాసం -సమాజం పై ప్రభావం అన్న అంశంపై కేంద్ర ప్రభుత్వ యుజిసి సంస్థకు చేస్తున్న సమగ్ర పరిశోధనకు ఆయన భాద్యత వహిస్తున్నట్లు తెల్పారు. అంతకు ముందు సభాధ్యక్షులు అల్లు భాస్కర్ రెడ్డి గారు నాటకం జన బాహుళ్యం లోకి సందేశాలను తీసుకెళ్ళే శక్తి వంతమయిన ప్రక్రియ అన్నారు, తెలుగు నాటక రంగానికి సురభి కళాకారుల సేవలు శ్లాగనీయమయినవి అన్నరు. రామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు డాక్టర్ మోహన్ రాజు ప్రసంగిస్తూ ఆధ్యాత్మిక వాంగ్ మయాన్ని ప్రచారం చేయాలో తెలుగు నాటకం కీలక పాత్ర వహిందని గుర్తు చెసారు. అంతకు ముందు ప్రముఖ కవి పెరుగు రామకృష్ణ ముఖ్య అతిధిని సభకు సమగ్రంగా పరిచయం చెసారు. అనంతరం డాక్టర్ కడియాల రామ్ మోహన్ రాయ్ దంపతులను ప్రభాకర్ రెడ్డి దంపతులు ఘనగా సథ్కరించారు. డాక్టర్ కరిమద్దిల నరసింహా రెడ్డి,బాలభవన్ డైరెక్టర్ సుభద్రాదేవి, కవయిత్రులు అనురాధా రామకృష్ణ ,పెరుగు సుజనారామం, శిరీష ,జగదీశ్ ,రవి, కృష్ణ మరియు సాయిసదన్ సత్సంగ సభ్యులు పాల్గొన్నరు.

Sunday, March 25, 2012

మనసులు పంచుకోవడమే కవిత్వం


ఇండియా, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, భూటాన్‌, అఫ్ఘానిస్తాన్‌, మాల్దీవులు, నేపా- ఎనిమిది (‘సార్క్‌’) దేశాలు)అధీకృత శిఖరాగ్ర సాంస్కృతిక వ్యవస్థ ‘ఫౌండేషన్‌ ఆఫ్‌ సార్క్‌ రైటర్స్‌ అండ్‌ లిటరేచర్‌’ తన 34వ విస్తృత అంతర్జాతీయ సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాన్ని ఈ నెల.. అంటే మార్చి 16,17,18,19 తేదీలలో ‘లక్నో’లో నిర్వహిస్తోంది.

8 సార్క్‌దేశాల రచయితలు, కవులు, కళాకారులు, పాత్రికేయులు, మీడియా ప్రముఖులు పాల్గొనబోయే నాలుగు రోజుల ఈ శిఖరాగ్ర సదస్సులో దక్షిణాసియా దేశాల మధ్య మానవీయ ప్రాతిపదికన సామాజిక విలువల పునరుద్ధరణ, పర్యావరణ జీవావరణ రంగాల పరిరక్షణ, కాలుష్య నివారణ, నియంత్రణ పరిశ్రమల విస్తరణతో ధ్వంసమౌతున్న పర్యావరణ సమతుల్యత, ఈ భూగ్రహంపై దీర్ఘకాలిక సౌభాగ్య వాతావరణ పరిరక్షణకై అత్యవసర చర్యలు.. వంటి అనేక కీలక అంశాలపై అధ్యయనం, చర్చ, సమాలోచనలు జరిపి సార్క్‌ దేశాల అధినేతలకు తగు సూచనలను, సలహాలను అందజేసే బుద్ధి జీవుల సంగోష్ఠిగా ఈ శిఖరాగ్ర సదస్సును ఏర్పాటు చేస్తున్నట్టు ‘పోస్వాల్‌’ అధ్యక్షురాలు పద్మశ్రీ అజిత్‌ కౌర్‌ తెలిపారు.

ఈ సాహిత్య ఉత్సవ ప్రధాన చర్చాంశం ‘అవర్‌ఎర్త్‌- అవర్‌ ఓన్లీ హోమ్‌’. దాదాపు వందకు పైగా ప్రఖ్యాత రచయితలు, వివిధ సామాజికరంగాలకు చెందిన ప్రముఖులు ఈ సదస్సులో చర్చల్లో పాలుపంచుకుని సంపన్నం చేయనున్నారు.‘సార్క్‌’ దేశాల ఐక్య సంఘటన ఏర్పడిన తర్వాత సభ్యదేశాల మధ్య ప్రజలు, సమాజాల మధ్య సౌభ్రాతృత్వంతో నిండిన సాంస్కృతిక, సామాజిక, నాగరికతా సంబంధమైన పురాతన వారసత్వ వినిమయ లక్ష్యంతో ఒక శిఖరాగ్ర అంతర్జాతీయ వేదికనొక దానిని ఏర్పర్చేందుకు మేధోజీవులు కృషి చేస్తూ వచ్చారు.

ఆ ప్రయత్నాల ఫలితంగా 1984లో ఒక ప్రభుత్వేర సామాజిక సంస్థగా ‘ఫౌండేషన్‌ ఆఫ్‌ సార్క్‌ రైటర్స్‌ అండ్‌ లిటరేచర్‌’ ఏర్పడింది. దీనికి ప్రముఖ సాహిత్యకారుడు కుష్వంత్‌ సింగ్‌ చైర్మన్‌గా, ప్రముఖ పరిశోధకురాలు, రచయిత్రి అజిత్‌ కౌర్‌ అధ్యక్షురాలిగా వివిధ దేశాలకు చెందిన 98 మంది పాలకమండలి సభ్యులుగా నాయకత్వం ఏర్పడింది. అందువల్ల భారత పాకిస్థాన్‌ విభజనానంతరం మొట్టమొదటి సారి 1987లో మొదటి ‘పాకిస్థానీ మేధోజీవుల బృందం’ భారత నేలపై కాలుమోప గలిగింది.

తర్వాత్తర్వాత భారత రచయితల బృందం కూడా 2011లో పాకిస్థాన్‌ను సందర్శించి మనుషుల మధ్య మానవకృత భౌగోళిక సరిహద్దులను ధ్వసించగల్గిన ఒక హృదయపరిమళ పరస్పరాస్వాదనను సాధ్యపర్చగల్గింది. ఆ తర్వాత వివిధ దేశాల భూభాగాలపై పదుల సంఖ్యలో జరిగిన సాహిత్య, సాంస్కృతిక సమ్మేళనాలు ఈ 8 మిత్ర దేశాల మధ్య గణనీయమైన స్థాయిలో సంగీత, సాహిత్య, ఇతర కళల ఆదాన ప్రదానాలతో కొత్త తలుపులను తెరిచి విస్తృతమౌతూ వస్తున్నాయి.

ఈ సాంస్కృతిక వేదిక నిర్వహణలో పాలుపంచుకుంటున్న కొందరు ప్రముఖులు డాక్టర్‌ అబిద్‌ హుస్సేన్‌, గుల్జార్‌, లలిత్‌ మాన్‌సింగ్‌, ఎ.బి. బర్దన్‌, సి.ఎం. ఒబెరాయ్‌, మహాశ్వేతాదేవి, సీతాకాంత్‌ మహాపాత్ర, ఎం.టి. వాసుదేవన్‌ నాయర్‌, ఇందిరా గోస్వామి, రమాకాంత్‌ రథ్‌, కె. సచ్చిదానందన్‌, అశోక్‌ వాజ్‌పాయ్‌ మొదలగువారు.2000లో ఖ్మండూలో జరిగిన ‘శిఖరాగ్ర సదస్సు’లో యుద్ధ క్షేత్రం నుండి వచ్చిన అఫ్ఘానిస్థాన్‌ సాహిత్య సైనికులు తమ పుష్తో, దరి భాషలో వినిపించిన యుద్ధసంక్షోభ విశ్లేషణాత్మక కవిత్వం, సాహిత్యం ఆనాటి సభికులను ఎంతో కలచి వేసింది. ప్రతి సంవత్సరం పద్మశ్రీ అజిత్‌ కౌర్‌ నేతృత్వంలో ఈ 8 సార్క్‌ దేశాల రచయితల కవుల కవితలతో, కథలతో, వ్యాసాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో వెలువడ్తున్న పుస్తకాలు అనేకమంది విజ్ఞుల, విమర్శకుల ప్రశంసనలు పొందుతూనే ఉన్నాయి.

2010 మార్చి 26 నుండి 29 వరకు ఢిల్లీలో జరిగిన ‘సార్క్‌ శిఖరాగ్ర సదస్సు’ను ఫోస్వాల్‌, ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌’ సంయుక్తంగా ఘనంగా నిర్వహించాయి. అప్పుడు తెలుగు నేలనుండి కవులు రామా చంద్రమౌళి, పెరుగు రామకృష్ణ భారత ప్రతినిధులుగా పాల్గొన్నారు. గుల్జార్‌ వంటి సృజనాత్మక కవి నుండి.. హమిద్‌ మీర్‌ (జి.ఇ.ఓ. టివి-పాకిస్థాన్‌) వంటి- కపిల్‌ వాత్సాయన్‌, మార్క్‌ టుల్లీవంటి మీడియా లెజెండ్స్‌తో కలిసి ప్రేరణ పొందడం మరువలేని ఒక అపూర్వానుభవమే. దాదాపు 130 మంది అప్పటి ఆ విశిష్ట సభల్లో పాల్గొన్నారు.

ramachandraఇప్పుడు ‘లక్నో’లో జరుగబోతున్న 34వ ‘సార్క్‌ సాహిత్య శిఖరాగ్ర సదస్సు’ మళ్ళీ పద్మశ్రీ అజిత్‌ కౌర్‌ సారథ్యంలో 8 దేశాల మధ్య వాత్సల్య పూరిత సాహిత్య సారస్వత సౌరభాన్ని విరజిమ్ముతుందని తప్పకుండా ఆశించవచ్చు.‘నీ చేతులతో ఈ భూమిని స్వీకరించు... ఎందుకంటే నీ ఆశలు, నీ దుఃఖం, నీ కాంక్షలు నీ జీవితం.. అన్నీ ఈ మట్టిలోనే క్షిప్తమై ఉన్నాయి’ అన్నాడు అశోక్‌ వాజ్‌పాయి ఆనాటి సభలో.. 2010లో. మనుషులు కలుసుకోవడం, మనుషులు మాట్లాడుకోవడం, మనుషులు హృదయాలను పంచుకోవడమే కదా కవిత్వమంటే!