Friday, December 31, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలు..2011

ప్రియ మిత్రులారా..!
స్కాములు లేని పాలనని, రాజనీతిజ్ఞ్తత కలిగిన నేతల్ని, రక్తం చిందని రోడ్లని,
ఏ వర్గం ప్రజలు కన్నీరు కార్చని రాజ్యాన్ని,వుగ్రవాదపు ఊచకోతలు ,పేలే
మందు పాతరలు,లేని క్షణాల్ని 2011 మనకందివ్వాలని
మానవత్వాన్ని,మనిషితనాన్ని ఆరోగ్యంగా ఉంచాలని, ఆకాంక్షిస్తూ..
శుభాకాంక్షలతో...

Wednesday, December 8, 2010

విశ్వ శాంతిని ఆకాంక్షించిన చెన్నైలో జరిగిన ఆరవ అంతర్జాతీయ సాహిత్యోత్చవం

ఇండియా ఇంటర్ కాంటినెంటల్ కాల్త్చారాల్ సంస్థ ,చండీగడ్ మరియు తమిళ నాడు హిందీ సాహిత్య అకాడెమీ
చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 4 ,5 తేదీలలో జరిగే ఆరవ అంతర్జాతీయ సాహిత్యోత్చవం చెన్నై లోని స్టెల్ల
మేరీ కాలేజీ లో ౪ వ తేది ఉదయం ఘనంగా ప్రారంభమైంది. .వసుదైక కుటుంభం అనే నేపధ్య అంశంపై జరిగే ఈ సదస్సును
తమిళ నాడు గవర్నర్ గౌ.సుర్జిత్ సింగ్ బర్నాల ప్రారంభించవలసి వుండగా స్వల్ప అనారోగ్యం వల్ల వారు రాలేక పోవడంతో
అఖిలభారత హిందీ ప్రచార సభ అధ్యక్షులు ,పూర్వ రాజ్య సభ సభ్యులు డా.రత్నాకర్ పాండీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
పాలస్తీనా,. కొసొవ,పాకిస్తాన్,ఉజ్బెకిస్తాన్,ఇంగ్లాండ్ తదితర దేశాల రచయితల తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల ,వివిధ భాషల నుండి వంద మంది రచయితలు పాల్గొని పత్ర సమర్పణలు,కథ,కవిత పట్టనాలు చేసి వసుదైక కుటుంభం ,సాహిత్యం ద్వార ప్రపంచ శాంతి అంశాల్ని చర్చించారు...
.
ఈ సాహిత్యోత్చవం లో పాల్గొనేందుకు ప్రముఖ పంజాబీ రచయిత ,నిర్వాహకులు దేవ్ భరద్వాజ్ ,చండిగద్ నుండి పలువురు తెలుగు రచయితలు ఆహ్వానం అందుకున్నారు.తెలుగు రచయితల సమన్వయ కర్త గా పెరుగు రామకృష్ణ(నెల్లూరు) ను నియమించారు.డా. అయినవరపు.రామలింగేశ్వర రావు (శ్రీ హరి కోట),శ్రీకాంత్,ఖాజా మొఇనుద్దిన్ వల్లభాపురం .జనార్ధన్ (మహబూబ్నగర్),డా.కే.వి.రఘుపతి(యోగి వేమన శ్వవిద్యాలయం,కడప), ప్రొ.రామచంద్రమౌళి (వరంగల్).అమరజ్యోతి (అనకాపల్లి).మైదవోలు వెంకట శేష సత్యనారాయణ (నెల్లూరు)పలమనేరు .బాలాజీ(చిత్తూర్)
ఎమ్మార్ వీ సత్యనారాయణ,(పెనుగొండ) ర్యాలి ప్రసాద్ (కాకినాడ),గోపీచంద్,నాగ సుశీల(గుంటూరు) ప్రత్యెక ఆహ్వాన రచయితలుగా హాజరయ్యారు.

ప్రారంభ సదస్సులో ముఖ్య అతిధి డా.రత్నాకర్ పాండే సాహిత్య కారులు సూక్ష్మ దృష్టి తో ఆలోచించాల్సిన సమయ మీదని,మూడువేల సంవస్చారాల
క్రితమే ఈ దేశంలో వసుదైక కుటుంబం జాడలు వున్నాయని ,ఇప్పుడు న్యూ క్లియర్ కుటుంబాలుగా విడిపోయి,మానవసంభందాలకు విఘ్హతం
కలిగి స్వార్ధ చింతన పెరిగి పోయిందని అన్నారు.సాహిత్యం ద్వారా విశ్వ శాంతిని ,సమైక్యతని నిలపాలని పిలుపునిచ్చారు.వీరు పలు పుస్తక ఆవిష్కరణలు చేసారు..
వాటిలో నెల్లూరు సత్యనారాయణ రచన "వ్హీల్స్ " ఆంగ్ల కవిత సంపుటి పలువురి దృష్టిని ఆకర్షించింది..ఇంగ్లీష్ కవిత్వంలో సామాజిక స్పృహ చొప్పించిన
కవిగా అందరి మన్ననలు అందుకొన్నారు..

రెండవ సదస్సుకి అధ్యక్షత వహించిన ప్రముఖ కవి,రాష్ట్ర ప్రభుత్వ పురస్కార గ్రహీత పెరుగు రామకృష్ణ వినిపించిన హృదయ హారం కవితకి ఆంగ్లానువాదం
"గార్లాండ్ అఫ్ హేఅర్ట్స్",మరియు ప్రముఖ ఆంగ్ల కవి ,ఎడిటర్స్ చాయిస్ అవార్డు గ్రహీత మైదవోలు సత్యనారాయణ కవిత "సం హోప్" పలువురి ప్రసంశలు
అందుకుని అలరించాయి.అనంతరం పెరుగు రామకృష్ణ ,సత్యనారాయణ ఇతరు లను దేవ్ భరద్వాజ్ మరియు డా.మధు ధావన్ ప్రశంస పత్రాలతో సత్కరించారు..

పెరుగు.రామకృష్ణ
--

ఫోటో వివరాలు:1 జ్యోతి ప్రజ్వలన..
2 రెండవ సదస్సుకు ఆహ్యక్షత వహిస్తున్న పెరుగు
3 .స్లొవాకియా రచ్యితలత్కో పెరుగు,సత్యనారాయణ
.. 4 .సత్య పుస్తకం వ్హీల్స్ ఆవిష్కరణ చేస్తున్న డా.రత్నాకర్ పాండే
--
ramakrishnaperugu
IMG_2677.JPGIMG_2677.JPG
1425K View Download
IMG_2690.JPGIMG_2690.JPG
1226K View Download
IMG_2688.JPGIMG_2688.JPG
1485K View Download
IMG_2685.JPGIMG_2685.JPG
1168K View Download

Wednesday, May 19, 2010

"ప్రకృతిని పరిరక్షించలేని మనిషికి విధ్వంసం చేసే హక్కేక్కడిది..?"

--- ప్రశ్నించిన సార్క్ దేశాల రచయితల సదస్సు
ఫౌండేషన్ ఆఫ్ సార్క్ రైటర్స్ అండ్ లిటరేచర్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రిలేషన్స్ సంయుక్త ఆద్వర్యంలో మార్చి 26,27,28 తేదీలలో న్యూడిల్లీ లోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో "పర్యావరణం-సాహిత్యం-సాంస్కృతిక బంధం " నేపధ్య అంశంగా ౩౩వ సార్క్ సాహిత్యోత్సవం ఘనంగా జరిగింది .దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సంఘంలోని 8 దేశాలయిన ఆప్ఘనిస్తాన్ ,బంగ్లాదేస్, భూటాన్ ఇండియా ,మాల్దీవులు ,నేపాల్, పాకిస్తాన్ ,శ్రీలంక కు చెందిన పర్యావరణ వేత్తలు మేధావులు ,ఆచార్యులు ,కవులు కథారచయితలు ,సంపాదకులు పాత్రికేయులు ,సృజనకారులు మూడురోజుల ఈసాహిత్యోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఒకే నేలను,ఒకే ఆకాశాన్ని, ఒకే సముద్రాన్ని, ఒకే పర్వతశ్రేనుల్ని,ఒకే రుతువుల్ని, రుతుపవనాల్ని కలిగిన ఈ ఎనిమిది దేశాల ప్రతినిధులు- ప్రపంచీకరణ ,వేడెక్కుతున్న
భూమి , కాలుష్యం నేపధ్యంలో కోల్పోతున్న ప్రకృతి ,అడవులు ,నదులు ,పర్వతాలు ,దెబ్బతింటున్న పర్యావరణ సమతుల్యత ,తదితర అంశాలపై లోతుగా, శాస్త్రీయంగా చర్చలు జరిపేందుకు అత్యున్నత వేదిక అయింది .ఈ సాహిత్యోత్సవం ఎనిమిది దేశాల బుద్దిజీవులు మూడురోజులపాటు ఈ అంశాలపై మేదోమదనం చేసేందుకు దోహద పడింది .
26 వ తేది ఉదయం పదిగంటలకు భారత ఉపరాష్ట్రపతి సదస్సు ప్రారంభించాస్లి ఉండగా అనివార్య కారణాలచేత హాజరు కాలేక పోయారు ,ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్
అధ్యక్షలు భారతీయ వేదాలు ,ఇతిహాసాలపై గొప్ప అవగాహన గల వ్యక్తి డాక్టర్ కరణ్ సింగ్ సదస్సును ప్రారంభించారు .అకాడమిక్ సెక్షన్ ను ప్రారంభిస్తూ FOSWAL వ్యవస్థాపక అధ్యక్షురాలు, ప్రముఖ రచయిత్రి, పద్మశ్రీ అజిత్ కౌర్ "సింహాలను కాపాడండి" ...అనే హాస్యాస్పద నినాదాలు చేసి ఊరుకుంటారు కొందరు అప్పుడప్పుడు. మొత్తంగా అడవులు నదులు,పర్యావరణ మొత్తం కాపాడాలని ఎందుకు నినదించరో తన పత్ర సమర్పణలో నిలదీశారు .ఫోస్వాల్ అదనపు చైర్మన్ ప్రఖ్యాత రచయిత, విద్యావేత్త ,డాక్టర్ అబిడ్ హుస్సేన్ పర్యావరణ స్పృహ పెమ్పొందిచడంలో ప్రతి ఒకరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
మాజీ బి బి సి భారతీయ బ్యూరో ఇంచార్జి మార్క్ తుల్లీ తన ప్రసంగంలో ఆధ్యాత్మిక అంతరంగం కలవారేవ్వారు, ప్రకృతిని సహజ వనరుల్ని విధ్యంసం చేయరని తెల్పారు. భగవంతుని పట్ల నమ్మకం కలిగి వుండటం అంటే మానవత్వాన్ని ,పర్యావరణాన్ని పదిలంగా కాపాడుకోవదమేనని అన్నారు .
శ్రీలంక నుండి విచ్చేసిన దౌత్యవేత్త నిహావ్ రోడ్రిగో ,పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యురాలు బేగం పర్యావరణ పరిరక్షణ దక్షిణాసియా దేశాలలోనే కాక ప్రపంచ ప్రాధాన్య అంశంగా ప్రస్తావించారు .
అనంతరం ప్రముఖ సినీకవి జయహో గీతం సృష్టికర్త గుల్జార్ కవిత్వంతో సాహిత్యోత్సవాన్ని ప్రారంభించారు. చెట్టు మానవజీవితంలో పెనవేసుకున్న పరంపర అని ,కొమ్మలుగా రేమ్మలుగా ,శాఖలుగా విస్తరించిన చెట్టును, కొట్టేసినా తిరిగి మొలకెత్తే గుణం కోల్పోదని, ఆర్ద్రంగా కవిత్వీకరించారు. ప్రముఖ పాకిస్తాన్ కవి సర్మాద్ సేహభాయి కుడా తమ కవితతో గుల్జార్తో గొంతు కలిపారు.
తర్వాత సార్క్ జీవితకాల పురస్కారం అయిదు లక్షల రూపాయలు జ్ఞాపికతో ప్రముఖ పాకిస్తాన్ పాత్రికేయుడు ,జీ టీవి మీడియా ప్రతినిధి హమీద్ మీర్ ను అతిధులు సత్కరించారు. సార్క్ సాహిత్య పురస్కారాలు నేపాలీ ప్రొఫెసర్ అభినారాయన్ సుభేది మరియు మార్క్ తుల్లీ చెరొక లక్ష రూపాయలతో సత్కరింప బడ్డారు. సార్క్ పర్యావరణ పురస్కారాలు భారతదేశానికి చెందిన సంత్బర్బీవ్ సింగ్ సిఇచ్వాన్ (యమునా క్లీనిగ్) ,కే కే మహమ్మద్ (హిందూదేవాలయాల పరిరక్షణ పునురుద్దరణ ),బాబా సేవాసింగ్ (గురునానక్ స్నానం చేసిన బీన్ నది పరిరక్షణ ),లకు లక్ష రూపాయల నగదు జ్ఞాపికలతో సత్కరించారు .సార్క్ యువ రచయిత అవార్డ్ బంగ్లా దేస్ కు చెందిన రుబానా హక్ కు లభించింది.ICCR Director General వీరెంద్రగుప్త వందన సమర్పణతో ఈ ప్రారంభ సదస్సు ముగిసింది.

ఇక అప్పటి నుండి 28 వరకు వివిధ సాహిత్య సదస్సుల్లో ప్రముఖ భారతీయ కవులు కున్వర్ నారాయణ్ ,అశోక్ వాజ్పాయ్,ఉదయ్ప్రకాష్ ,కే,సచ్చిదానంద ,సుర్జిత్ పటార్ ,దినేష్ మిశ్రా ,కన్జీపటేల్,కేసవ్మాలిక్ ,శ్రీమతి జలబాలవైద్య ,నేపాల్ యువకవులు గీతా త్రిపాటి ,భూపేన్ వ్యాకుల్,మనుమంజల్ ,సబితాగౌతం,శ్రీలంక కవులు జీన్ అరసనయాగం ,పార్వతి,బంగ్లాదేస్ కవయిత్రులు ఖ్యజ్రోజీ,జర్నీ రహమాన్ ,అప్ఘనిస్తాన్ నుండి అహమద్ ఆలిసహాక్ ,భూటాన్ నుండి కిన్గా చోదేన్,మాల్దీవుల నుండి హైసాల్ ఆనియా ,పాకిస్తాన్ నుండి అర్షద్ ముహాముద్ తదితరులు పర్యావరణం,జలకాలుశ్యం,సబ్ద కాలుష్యం అంశాలపై బలమైన గొంతుకతో కవిత్వం వినిపించారు.
దక్షిణ భారత ప్రతినిధులుగా ఆహ్వానితులయిన తెలుగు కవులు రామాచంద్రమౌళి" సెల ఏటి నీటిలో రక్త ధార" ,పెరుగు రామకృష్ణ "శబ్ద ఖననాన్ని కోరుకొంటున్నా"
పర్యావరణ అంశంపై కవితలాపన ఆంగ్లం లో చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు..
జోగీన్దర్పాల్ ,పాప్రి రహమాన్, సేవేనా హుస్సేన్ ,దేవేందర్ ఇస్సార్, ఇమ్రాన్ హుస్సేన్, తాహిర ఇక్బాల్, పుదువై రజని -కథ రచయితలు కథానికలలో పర్యావరణ స్పృహ వెలిబుచ్చారు .

-పెరుగు.రామకృష్ణ ,నెల్లూరు
IMG_1973.JPGIMG_1973.JPG
1308K View Download
IMG_1982.JPGIMG_1982.JPG
1123K View Download

ఫోటోల వివరాలు
1.ప్రారంభ సదస్సు :వేదికపై కరణ్ సింగ్ ,మార్క్ తుళ్ళి ,అబిద్ హుస్సేన్ ,తదితరులు
2.ప్రముఖ సినీ కవి గుల్జార్ తో తెలుగు కవులు రామాచంద్రమౌళి,పెరుగు.రామకృష్ణ

Tuesday, February 23, 2010

ప్లెమింగో (విడిది పక్షుల దీర్ఘ కవిత)


సమీక్షకుడు: జాన్ హైడ్
“సమాజాన్ని మేల్కొలిపేది పక్షి
రాత్రి ఏ జాములోనో
కలత చెందిన నిద్ర
మెలకువై తట్టిలేపింది
నిదురకోసం నిరీక్షించిన కళ్ళూ, కాయం
అసహనంగానే విద్యుత్తుదీపాన్ని వెలిగించి చెతికందిన పుస్తకపేజిల్లోకి కళ్ళను, మనసును దూర్చింది. కాల ప్రభావమో, అక్షరాల మోహమో నాకు రెక్కలు తొడిగి ఎక్కడెక్కడో తిప్పింది. ఏటి గట్టున నుంచి సర్స్సుల్లోకి, సరస్సుల్లోచి సముద్రాల్లోకి ఈదులాడచేసింది
బయట..
పిట్టచాపిన రెక్క తొలికోడయ్యింది ఇక నేనూ జీవనసమరానికి పక్షినవ్వాలి.
ఇది ప్లెమింగో చదివిన వెంటనే తక్షణ స్థితి.

ఇది పన్నెండు భాగాల దీర్ఘ కవిత.
ఫ్లెమింగో అని పేరుచూడగానే ఒక జాతి పక్షినిగూర్చిన సమగ్ర విషయాలు వివరాలు వుంటాయనుకున్నాను కానీ ఇందులో స్పూర్తినిచ్చిన పక్షి ప్రతీక. వాల్మీకి పక్షిని వేటాడినప్పుడు ఆ పక్షి విలవీలాడటం చూసి శోకించి శ్లోకం పలికాడు. ఇక్కడ నాకనిపిస్తుంది ఫ్లెమింగోయే రామకృష్న్ణను వెంటాడి వేటాడి ఇలా దీర్ఘ కవితై మనముందు వాలిందని.
కాలాన్ని ఎన్నికోణాలనుంచి చూడొచ్చో ఆ పార్శవాలన్నీ ఆవిష్కరిస్తూ మొదలౌతుంది ఈ దీర్ఘ కవిత. మనిషి జీవితం, పక్షి జీవితం, వలస జీవితం వీటిమద్యవుండే తాత్వికతని ఆవిష్కరిస్తూ పక్షిలో పరకాయ ప్రవేశం చేయాల్సిందే అంటూ ముగిస్తాడు.
కొన్ని పదాలకు నిఘంటువు సహాయాన్ని ఆశ్రయించవల్సిందే! పాఠకులు ఎంతవరకూ చేస్తారనేది వారి వారి అభిరుచులకు వదిలి పెట్టడటమే.
అక్కడక్కడా కనిపించే అంత్య ప్రాస, శబ్ద లయతో సాగే కొన్ని పదాలు ఆశాంతం చదివేలా చేస్తుంది.
పువ్వు ప్రయాణిస్తుంది
పరాగమై
పువ్వునుంచి పువ్వువరకు
అనురాగమై
పక్షి ప్రయాణిస్తుంది
సరాగమై
తీరంనుంచి తీరం వరకు
పరంపర రాగమై”
పక్షి లక్ష్యాన్ని తెల్పుతూనే ప్రాస, శబ్దలయల నడకల సోయగాన్ని చూపిస్తాడు
ఒక వేకువను స్వాగతిస్తూ
“సమాజాన్ని మేల్కొలిపేది పక్షి” అని పక్షి అవసరతను తెలియచేస్తాడు.

వలసవచ్చే ఫ్లెమింగోలతోపాటు మనమూ వలసపోవటం ఖాయం.

చదావాల్సిన పుస్తకం

*******************************************

ప్లెమింగో (విడిది పక్షుల దీర్ఘ కవిత)
కవి : శ్రీ పెరుగు రామకృష్ణ.
విడుదల ఫిబ్రవరి 2006, వెల రు. 30/-
దొరుకుచోట్లు : నెరసం ప్రచురణలు, 25-1-949, నేతాజీ నగర్, 5వ వీధి, ఎ.కె. నగర్, నెల్లూరు-524 004 9849230443
మరియు విశాలాంద్ర

పుస్తకం.నెట్ సౌజన్యంతో

Monday, January 25, 2010

కొత్త మనిషి...!

రక్తం రంగు
చెప్పనక్కరలేదు
నువ్వు మనిషి వాసన వేస్తే చాలు..
నీ స్పర్శ నిరంతర పరిచయాల దొంతర
నులివెచ్చదనమొక్కటే కరువైంది
ఈ నేలకు నిన్ను చిరునామా చేయడం
నీలోని శాంతి సహన పర్వానికి నిదర్శనం
నీ చిరునామా కొరకు నువ్వెతుక్కోవడమంటే
పువ్వు పరిమళాన్ని కోల్పోయిందనే
మట్టివాసన సమసిపోయిందనే
లింగ వివక్షా పరీక్షల్లో నీ ఉనికి నువ్వు కోల్పోయావనే
పావురం కోసం తొడ మాంసాన్ని తూచిన
నీకొండ పిడికెడు గుండెగా మారిందా..?
నీ కాలి ధూళి తాకితే రాతి నాతిగా మారే గుణం కరువైందా..?
వొక్క పిలుపుకి కోటి పాదాలై కదలిన నీ నడక
శాంతి యుద్ధానికి శత సహస్ర ప్రాణాలుగా విచ్చుకున్న ఆత్మ
నీలోని పంచభూతాల్లోని జీవ లక్షణమే కదా..!
జీవ లక్షణానికి మరణం వుండదు,ఋణం తప్ప
బతికుండగానే, అమ్మను కాటికి మోసినప్పుడే
నీ భుజాల నుంచి కుళ్ళిన శవాల కంపు మొదలైంది
నీలో మనిషి మరణించిన చావుకేక వినిపించింది
ప్రపంచాగ్నికి ఆహుతిచ్చిన స్వార్ధ సమిధలు నిరర్ధకం
పిచ్చుక గూట్లో ఇరుక్కొని రాత్రంతా వెలుతురైన
ఒక మిణుగురు కావాలి ,స్తబ్దాటవిలో పాదయాత్ర కోసం
ఆ మిణుగురు తనం ఆరిపోయింది నీలో
కోట్లాది కన్నుల్లో కన్నీటి తడిని తుడిచిన
కరుణకు మొలిచిన ఆ చేయి విరిగిపోయింది నీలో..
వర్షానికి గొడుగుపట్టడం వేరు,.
ఎండకి నీడగా చెట్టు అయి మొలవడం వేరు
రెండు చేతుల్ని వేయిచేసి నిండు మనసుతో
కౌగిలించుకునే అమ్మతనం ఆరిపోయింది నీలో..
విత్తుగా మొలకేత్తే గుణం చచ్చిపోయింది నీలో
నీలో ప్రాణమనే లక్షణం మరణించడానికి ముందే
నేల తల్లి చిరునామా మారిపోవడానికి ముందే
నువ్వు ఫీనిక్స్లా ,అగ్నిస్నానం చేయాలిప్పుడు
కొత్త ఆకాశం అక్కర్లేదు, కొత్త రుతువులు అక్కర్లేదు
వందేమాతర గీతమై కొత్త మనిషిగా మొలకెత్తాలిప్పుడు...!

(This poem bagged First best prize of Rs 4000/- and citation in International poetry contest by koumudi.net web journal in April2007 )

Saturday, January 16, 2010

ఏవి గొప్ప...?
పాత తరం అమ్మ
ఎనభై ఏళ్ళ బామ్మ
పాతికేళ్ళ
మా ఇంజనీర్
బంగారు బొమ్మ తో
పండుగ పిండివంటలు చేస్తూ
"మీకు ఇప్పుడు
పుట్టినరోజు ,పెళ్లిరోజు,
ప్రేమికుల రోజు,తల్లి రోజు,తండ్రి రోజు "..
ఇన్నీ..

ప్రతి క్షణం
ఆత్మీయత,అభిమానం,
అనురాగం,ఐకమత్యం
వెల్లివిరిసిన రోజులు..!
మావి అన్నీ..

Wednesday, January 6, 2010

కొన్ని అనువాద హైకూలు..!


Photo by cbrao taken at Kokkare Bellur, Karnataka.

చీకటిని పారద్రోల్తూ
ఓ పక్షి పాట..
సూర్యోదయం..!

చావు కళ
వేయి నోళ్ళు తెరుచుకున్నట్లు
ఎండిన మాగాణి..!

మంచు ముత్యం..
కత్తి మొన లాంటి
గడ్డి పోచ చివర..!

పరిమళం తీపి
పంచుతునే వుంది..
చెట్టు ముక్కలైనా..!

అర్థ రాత్రి
ఆకాశం కింది రెండో అంతస్తే
వారికిల్లయింది..!

ఆంగ్ల మూలం:షారోన్ ఆబ్రెల్,విస్కన్సిస్
అనుసృజన: పెరుగు రామకృష్ణ,నెల్లూరు

Saturday, January 2, 2010

పూలతోట కాలుతోంది..నిరసనల పోరు
నిప్పురవ్వల జోరు..
నిన్నటిదాకా
పరిమళాలు పంచిన

పూలతోట కాలుతుంది..
రేపటికి మిగిలేది
అస్తిత్వాల అస్థికలే కాబోలు..
కుల వివక్ష..
లింగ వివక్ష..
జాతి వివక్ష...
వివక్షలేప్పుడూ
విభజన రేఖ లే గీస్తుంటాయిగా ...!
ఐక్య రాగం పాడే వీణను
ఏక రాగానికే పరిమితం చేద్దామా..?
సంకుచితత్వాల్ని
సముద్రలోతుల్లోకి విసిరేద్దాం ..!
విశాలత్వాన్ని
వినీలాకాశంలా కాపాడుకొందాం..!
"విశ్వమానవ సౌబ్రాత్రుత్వం" ..
"వసుదైక కుటుంబం"
పద అర్ధాలు పదిలపరచుకొందాం ..!!