Wednesday, May 19, 2010

"ప్రకృతిని పరిరక్షించలేని మనిషికి విధ్వంసం చేసే హక్కేక్కడిది..?"

--- ప్రశ్నించిన సార్క్ దేశాల రచయితల సదస్సు
ఫౌండేషన్ ఆఫ్ సార్క్ రైటర్స్ అండ్ లిటరేచర్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రిలేషన్స్ సంయుక్త ఆద్వర్యంలో మార్చి 26,27,28 తేదీలలో న్యూడిల్లీ లోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో "పర్యావరణం-సాహిత్యం-సాంస్కృతిక బంధం " నేపధ్య అంశంగా ౩౩వ సార్క్ సాహిత్యోత్సవం ఘనంగా జరిగింది .దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సంఘంలోని 8 దేశాలయిన ఆప్ఘనిస్తాన్ ,బంగ్లాదేస్, భూటాన్ ఇండియా ,మాల్దీవులు ,నేపాల్, పాకిస్తాన్ ,శ్రీలంక కు చెందిన పర్యావరణ వేత్తలు మేధావులు ,ఆచార్యులు ,కవులు కథారచయితలు ,సంపాదకులు పాత్రికేయులు ,సృజనకారులు మూడురోజుల ఈసాహిత్యోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఒకే నేలను,ఒకే ఆకాశాన్ని, ఒకే సముద్రాన్ని, ఒకే పర్వతశ్రేనుల్ని,ఒకే రుతువుల్ని, రుతుపవనాల్ని కలిగిన ఈ ఎనిమిది దేశాల ప్రతినిధులు- ప్రపంచీకరణ ,వేడెక్కుతున్న
భూమి , కాలుష్యం నేపధ్యంలో కోల్పోతున్న ప్రకృతి ,అడవులు ,నదులు ,పర్వతాలు ,దెబ్బతింటున్న పర్యావరణ సమతుల్యత ,తదితర అంశాలపై లోతుగా, శాస్త్రీయంగా చర్చలు జరిపేందుకు అత్యున్నత వేదిక అయింది .ఈ సాహిత్యోత్సవం ఎనిమిది దేశాల బుద్దిజీవులు మూడురోజులపాటు ఈ అంశాలపై మేదోమదనం చేసేందుకు దోహద పడింది .
26 వ తేది ఉదయం పదిగంటలకు భారత ఉపరాష్ట్రపతి సదస్సు ప్రారంభించాస్లి ఉండగా అనివార్య కారణాలచేత హాజరు కాలేక పోయారు ,ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్
అధ్యక్షలు భారతీయ వేదాలు ,ఇతిహాసాలపై గొప్ప అవగాహన గల వ్యక్తి డాక్టర్ కరణ్ సింగ్ సదస్సును ప్రారంభించారు .అకాడమిక్ సెక్షన్ ను ప్రారంభిస్తూ FOSWAL వ్యవస్థాపక అధ్యక్షురాలు, ప్రముఖ రచయిత్రి, పద్మశ్రీ అజిత్ కౌర్ "సింహాలను కాపాడండి" ...అనే హాస్యాస్పద నినాదాలు చేసి ఊరుకుంటారు కొందరు అప్పుడప్పుడు. మొత్తంగా అడవులు నదులు,పర్యావరణ మొత్తం కాపాడాలని ఎందుకు నినదించరో తన పత్ర సమర్పణలో నిలదీశారు .ఫోస్వాల్ అదనపు చైర్మన్ ప్రఖ్యాత రచయిత, విద్యావేత్త ,డాక్టర్ అబిడ్ హుస్సేన్ పర్యావరణ స్పృహ పెమ్పొందిచడంలో ప్రతి ఒకరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
మాజీ బి బి సి భారతీయ బ్యూరో ఇంచార్జి మార్క్ తుల్లీ తన ప్రసంగంలో ఆధ్యాత్మిక అంతరంగం కలవారేవ్వారు, ప్రకృతిని సహజ వనరుల్ని విధ్యంసం చేయరని తెల్పారు. భగవంతుని పట్ల నమ్మకం కలిగి వుండటం అంటే మానవత్వాన్ని ,పర్యావరణాన్ని పదిలంగా కాపాడుకోవదమేనని అన్నారు .
శ్రీలంక నుండి విచ్చేసిన దౌత్యవేత్త నిహావ్ రోడ్రిగో ,పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యురాలు బేగం పర్యావరణ పరిరక్షణ దక్షిణాసియా దేశాలలోనే కాక ప్రపంచ ప్రాధాన్య అంశంగా ప్రస్తావించారు .
అనంతరం ప్రముఖ సినీకవి జయహో గీతం సృష్టికర్త గుల్జార్ కవిత్వంతో సాహిత్యోత్సవాన్ని ప్రారంభించారు. చెట్టు మానవజీవితంలో పెనవేసుకున్న పరంపర అని ,కొమ్మలుగా రేమ్మలుగా ,శాఖలుగా విస్తరించిన చెట్టును, కొట్టేసినా తిరిగి మొలకెత్తే గుణం కోల్పోదని, ఆర్ద్రంగా కవిత్వీకరించారు. ప్రముఖ పాకిస్తాన్ కవి సర్మాద్ సేహభాయి కుడా తమ కవితతో గుల్జార్తో గొంతు కలిపారు.
తర్వాత సార్క్ జీవితకాల పురస్కారం అయిదు లక్షల రూపాయలు జ్ఞాపికతో ప్రముఖ పాకిస్తాన్ పాత్రికేయుడు ,జీ టీవి మీడియా ప్రతినిధి హమీద్ మీర్ ను అతిధులు సత్కరించారు. సార్క్ సాహిత్య పురస్కారాలు నేపాలీ ప్రొఫెసర్ అభినారాయన్ సుభేది మరియు మార్క్ తుల్లీ చెరొక లక్ష రూపాయలతో సత్కరింప బడ్డారు. సార్క్ పర్యావరణ పురస్కారాలు భారతదేశానికి చెందిన సంత్బర్బీవ్ సింగ్ సిఇచ్వాన్ (యమునా క్లీనిగ్) ,కే కే మహమ్మద్ (హిందూదేవాలయాల పరిరక్షణ పునురుద్దరణ ),బాబా సేవాసింగ్ (గురునానక్ స్నానం చేసిన బీన్ నది పరిరక్షణ ),లకు లక్ష రూపాయల నగదు జ్ఞాపికలతో సత్కరించారు .సార్క్ యువ రచయిత అవార్డ్ బంగ్లా దేస్ కు చెందిన రుబానా హక్ కు లభించింది.ICCR Director General వీరెంద్రగుప్త వందన సమర్పణతో ఈ ప్రారంభ సదస్సు ముగిసింది.

ఇక అప్పటి నుండి 28 వరకు వివిధ సాహిత్య సదస్సుల్లో ప్రముఖ భారతీయ కవులు కున్వర్ నారాయణ్ ,అశోక్ వాజ్పాయ్,ఉదయ్ప్రకాష్ ,కే,సచ్చిదానంద ,సుర్జిత్ పటార్ ,దినేష్ మిశ్రా ,కన్జీపటేల్,కేసవ్మాలిక్ ,శ్రీమతి జలబాలవైద్య ,నేపాల్ యువకవులు గీతా త్రిపాటి ,భూపేన్ వ్యాకుల్,మనుమంజల్ ,సబితాగౌతం,శ్రీలంక కవులు జీన్ అరసనయాగం ,పార్వతి,బంగ్లాదేస్ కవయిత్రులు ఖ్యజ్రోజీ,జర్నీ రహమాన్ ,అప్ఘనిస్తాన్ నుండి అహమద్ ఆలిసహాక్ ,భూటాన్ నుండి కిన్గా చోదేన్,మాల్దీవుల నుండి హైసాల్ ఆనియా ,పాకిస్తాన్ నుండి అర్షద్ ముహాముద్ తదితరులు పర్యావరణం,జలకాలుశ్యం,సబ్ద కాలుష్యం అంశాలపై బలమైన గొంతుకతో కవిత్వం వినిపించారు.
దక్షిణ భారత ప్రతినిధులుగా ఆహ్వానితులయిన తెలుగు కవులు రామాచంద్రమౌళి" సెల ఏటి నీటిలో రక్త ధార" ,పెరుగు రామకృష్ణ "శబ్ద ఖననాన్ని కోరుకొంటున్నా"
పర్యావరణ అంశంపై కవితలాపన ఆంగ్లం లో చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు..
జోగీన్దర్పాల్ ,పాప్రి రహమాన్, సేవేనా హుస్సేన్ ,దేవేందర్ ఇస్సార్, ఇమ్రాన్ హుస్సేన్, తాహిర ఇక్బాల్, పుదువై రజని -కథ రచయితలు కథానికలలో పర్యావరణ స్పృహ వెలిబుచ్చారు .

-పెరుగు.రామకృష్ణ ,నెల్లూరు
IMG_1973.JPGIMG_1973.JPG
1308K View Download
IMG_1982.JPGIMG_1982.JPG
1123K View Download

ఫోటోల వివరాలు
1.ప్రారంభ సదస్సు :వేదికపై కరణ్ సింగ్ ,మార్క్ తుళ్ళి ,అబిద్ హుస్సేన్ ,తదితరులు
2.ప్రముఖ సినీ కవి గుల్జార్ తో తెలుగు కవులు రామాచంద్రమౌళి,పెరుగు.రామకృష్ణ

No comments: