Monday, May 2, 2011

వస్తు వైవిధ్యం కలిగిన నానీల పంట "ఆకు పచ్చజరి"



నిజజీవితంలోని ఆని పార్స్వాల్ని స్పృశించిన నానీల పుస్తకం ఆకు పచ్చజరి అని ప్రముఖ కవి,
రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట కవి పురస్కార గ్రహీత పెరుగు రామకృష్ణ పేర్కొన్నారు.నెల్లూరు లో మేడే రోజున
పెన్నా రచయితల సంఘం ద్వారా జరిగిన సభకు అధ్యక్షత వహించిన ఆయన మోపూరు పెంచల నరసింహం
రచించిన నానీల పుస్తకం ఆవిష్కరణకు ముందు ప్రసంగించారు.నానీల గురించి పలువురు ప్రముఖుల వ్యాఖ్యలను
ప్రస్తావించి నానీలు రాసే వారు నానీల ప్రాధమిక లక్షణాలు తెల్సుకుని రాయాలని సూచించారు..
డా.పెళ్లకూరు జయప్రద నానీల పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఎన్నో మంచి నానీలు ఇందులో ఉన్నాయన్నారు.
గోపి గారు ముందు మాటలో వాటిని విశ్లేషించడం ఎంతో అదృష్టం అన్నారు.గ్రంధ సమీక్ష చేసిన లతీఫ్ కుట్టి
ప్రతీకాత్మలతో మోపూరు కవిత్వం పరిణతి చెందిన పుస్తకం గా దీన్ని అభివర్ణించారు.
తొలి ప్రతిని న్యాయవాది గోవిందరాజు సుభద్రా దేవికి అందించారు.పాయసం సుబ్రహ్మణ్యం ,గుండల నరేంద్ర బాబు ,
పలువురు స్థానిక కవులు కార్యక్రమంలో

No comments: