ఆట లేదు
పాట లేదు
అభినందన అసలే లేదు
ఒక నిశ్శబ్ద ఆరాధన
సంబరోత్చ్చాహం..
నీ అడుగుల సవ్వడికై
..నిరీక్షణ
నీ రాక కోసం
పరి తాపం
ఓహ్ ..నువ్వోచ్చావ్..
నా ప్రాణమా
ఎంత ధైర్యం..
నన్నో ప్రేమోన్మాదిగా మార్చావ్
రాత్రి ..నా కళ్ళు మూతలు పడ్తూ
అయినా బలంగా నీ అందాన్ని ఆస్వాదిస్తూ
అలాగే ఒక క్షణం..కదలిపోకు ...
నీ లేత స్పర్శ రహస్యంతో
నేను పునర్జన్మిస్తా ..!
ఆంగ్లమూలం.ఇంగ్రిడ్ హేనజ్లేర్,ఇటలీ
అనుసృజన;పెరుగు.రామకృష్ణ
No comments:
Post a Comment