Thursday, May 19, 2011

నా ప్రాణమా


నా ప్రాణమా
నీ అందాన్ని ఆస్వాదించే
ఏ ఒక్క క్షణాన్నీ జారిపోనీయను
నీ ప్రేమ ప్రతిబింబించే ప్రతి ముఖం
పువ్వులు,చెట్లు,కొండలు
సూర్య చంద్రులు,వేల నక్షత్రాలు
కదిలే మేఘాలు
సుఖ దుఖాలు,కోప తాపాలు
నమ్మకం ,ఆశ
అన్నీ కలిపిన సంబరోత్చ్చవం ....

నన్నే ధ్యానించు,ప్రేమించు
నీ స్పర్సతో
రెండు ఆత్మలూ అల్లుకుని
ఏకమయి మేల్కొనీ ...!


ఆంగ్లమూలం:ఇంగ్రిడ్ హేనజ్లేర్ ,ఇటలీ
అనుసృజన:పెరుగు.రామకృష్ణ

No comments: