పిల్ల పిగిలేప్పుడు
సజీవ సహజత్వాన్ని చూసి
సంబర పడే తల్లి పిట్ట కళ్ళలోని ఆనందం...
పంట నూర్పిడి చేసి
కళ్లంలో ధాన్యం,తాలూ వేరు చేసి
రాసి పోసిన తిండిగింజలు చూసి
రైతు కళ్ళలో పొంగే విజయం...
లక్ష్యం కాక
గమ్యం ఎంచుకొని
రహదారిని ఏర్పరచుకుంటూ
చేసే బాట సారి ప్రయాణం...
కవి నడచి వెళ్ళిన చోట
కవిత్వం గుబాళించడం
రేపటి తరానికి సైతం
ఆ అభ్యుదయ పరిమళం విస్తరించడం...!
పెరుగు.రామకృష్ణ
No comments:
Post a Comment