Saturday, May 14, 2011

కన్నీటి చెరువు..




చేపలు పడ్తున్నా
ఒకటి,రెండు,మూడు
మూడే క్షణాల్లో ..
తాతయ్య చప్పట్లు లేవు
రోజూ పట్టే ఆయనకిదో లెక్క కాదు
ఇక్కడికి వచ్చినప్పుడల్లా
ఇలా చేపల వేట..
చెరువు మిగిలేవుంది
మునుపటిలా లేదు
ముసలిదైపోయింది
ఒక్కడినే నీళ్ళ దగ్గరి కెళ్ళాలంటే భయం
నలుపు,నీలం,పచ్చగా కన్పించే నీటిని చూస్తే కాదు
పాములా నన్ను చుట్టుకునే
బాల్యపు జ్ఞాపకాలు
గట్టిగా పట్టి విసిరేస్తాయి
నా సహనాన్ని పరీక్షిస్తాయి
వాటిని కాపాడు కోవాలంటే
మరో కన్నీటి చెరువు కావాల్సిందే
అందులో వేట మొదలెట్టాల్సిందే,...!


ఆంగ్ల మూలం; సొన్నెట్ మండల్,బెంగాల్

అనుసృజన :పెరుగు.రామకృష్ణ

No comments: